Wednesday 23 September 2015

ద్వాధశాత్మిక రాశి మరియు నక్షత్ర చక్రం

మేషము నుండి మీనం వరకు 12 రాశుల పర్యంతము అనగా ఒక ఆహ్హోరాత్రి కాలము తిరుగుచుండును. సుర్యుడున్న రాశి ఉదయం ప్రారంభమై మొత్తం 12 రాశులు ఒకదినమునకు తిరిగి వచ్చుచుండును.
అట్టి 12 రాశులను రాశి ఒకటికి 30 భాగములు కల్గి మొత్తము 360 భాగములు కల్గియుండును . వీటిని డిగ్రీలుగా పిలుస్తారు.

మరియు 27 నక్షత్రములు కూడా  ద్వాధశాచక్రం చుట్టూ తిరుగును.
ఒక నక్షత్రమునకు 4 పాదములతో మొత్తం 27 నక్షత్రములకు 108 పాదములు. ఒక రాశికి 9 పాదములుగా విభజిస్తారు. గ్రహములు నక్షత్రములలో నుండి ఒక రాశిలో 9 పాదములుంటూ వరుసగా 12 రాశులను వాటి వాటి కక్షలందు వాటి గమనములతో తిరుగును.
నవగ్రహములు ఒక రాశినుండి మరియొక్క రాశికి వాటి వాటి ప్రమాణముల ప్రకారముగా గమనము జరుగుచుండును.

 రాశి మరియు నక్షత్రపటము


Tuesday 22 September 2015

తెలుగు రాశులు

ఒక సంవత్సరంలో నక్షత్రాల మధ్యగా గమించే సూర్యుడి గమన మార్గాన్ని 'కాంతి మండలము' అంటారు ఈ గమన మార్గానికి దగ్గరగా ఉండే పట్టి లేక బెల్టువంటి బాగాన్ని రాశిచక్రం అంటారు. ఈ చక్రంలోని 12 నక్షత్రాలకు 12 పేర్లు పెట్టారు. వీటిని రాశి గుర్తులు అంటారు.

తెలుగు సంవత్సరాలు-వాటి పలితాలు





తెలుగు తిధులు